తెలంగాణలో ఉప ఎన్నిక.. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బైపోలు

-

దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు అయినటువంటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఒకేరోజు ఎన్నికలు జరుగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు, కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఇటీవలే కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే. దీంతో అక్కడ ఉప ఎన్నిక జరుగనుంది. 

ఇక  తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు నాలుగో దశలో జరుగనున్నాయి. మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నట్టు సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. జూన్ 04న కౌంటింగ్ జరుగనుంది. దేశవ్యాప్తంగా 7 దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 4దశలో జరుగనున్నాయి. ఏప్రిల్ 19న మొదటి దశ,  ఏప్రిల్ 26 రెండో దశ, మే 07, మే13 నాలుగో దశ, మే 20 5వ దశ, మే 25 ఆరో దశ, జూన్ 01 న 7వ దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల్లో చిన్నపిల్లలు ప్రచారం పాల్గొనకూడదని సూచించింది సీఈసీ. అదేవిధంగా వాలంటీర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో పాల్గొనకూడదని హెచ్చరించింది.

Read more RELATED
Recommended to you

Latest news