బరాత్​పైకి దూసుకెళ్లిన కారు.. ఆరుగురు దుర్మరణం

-

ఒడిశాను ఇటీవల తరచూ ప్రమాదాలు చుట్టుముట్టేస్తున్నాయి. ఆ రాష్ట్ర ప్రజల కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. ఇప్పటికే రైలు ప్రమాదం.. ఆ తర్వాత వరుస రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇక తాజాగా మరో రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలి తీసుకుంది. ఒడిశాలోని కెందుఝార్‌ జిల్లా సటిపూర్‌లో ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఊరేగింపుగా వెళ్తున్న పెళ్లి బృందంపైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందగా.. మరో ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన 20వ నంబర్ జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి ఒంటి గంటకు జరిగింది.

శాతిగఢ్​కు చెందిన సహీర్ కార్తిక్ పంగే కూతురు వివాహం.. మన్​పుర్​కు చెందిన హరిబంధు కుమారుడు హేమంత్​తో జరగాల్సి ఉంది. ఇందుకోసం వధువు ఇంటికి వరుడు హేమంత్​ తన కుటుంబ సభ్యులు, బంధువులతో బరాత్​గా బయల్దేరాడు. ఇంకా కొద్ది సేపటిలో వధువు ఇంటికి చేరుకోనున్న సమయంలో ఓ ట్రక్కు వారిపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడిక్కడే మరణించగా.. మరో ఆరుగురు గాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news