పెళ్లి అయినా వేరే వ్యక్తులతో ప్రేమను పంచుకుంటున్న కొందరు భారతీయ మహిళలు.. సర్వేలో వెల్లడి..!

-

వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేది కొత్త కాదు. ఎప్పటి నుంచో ఉన్నదే. పాశ్చాత్య దేశాల్లో ఈ పోకడ ఎక్కువగా కనిపిస్తుంది. అయితే ఆశ్చర్యకరంగా గత కొన్నేళ్లుగా భారత్‌లోనూ ఇలాంటి పరిస్థితి ఎక్కువవుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఇక ఓ ఆన్‌లైన్‌ డేటింగ్‌ సంస్థ ఇటీవల చేపట్టిన సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. అవేమిటంటే..

some indian women are in relationship with others even if married

ఫ్రెంచ్‌ ఎక్స్‌ట్రా-మారిటల్‌ డేటింగ్‌ యాప్‌ గ్లీడెన్‌ను కొందరు మహిళలు డెవలప్‌ చేశారు. దాన్ని మహిళల కోసం మహిళలే నిర్వహిస్తారు. ఆ డేటింగ్‌ యాప్‌కు భారత్ లో 13 లక్షల మంది యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో ఆ యాప్‌ ఇటీవల ఓ సర్వే చేపట్టింది. అందులో తేలిన విషయం ఏమిటంటే… భారత్‌లో పట్టణ ప్రాంతాల్లో, బాగా చదువుకుని, ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడ్డ 30 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న మహిళల్లో 48 శాతం మంది తమకు వివాహేతర సంబంధాలు ఉన్నాయని అంగీకరించారు. అలాగే వారికి పెళ్లి అవడం మాత్రమే కాదు, పిల్లలు కూడా ఉన్నారని, అయినప్పటికీ భర్తతో కాకుండా వేరే వ్యక్తులతో సంబంధాలు ఉన్నట్లు ఒప్పుకున్నారు.

ది న్యూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ సర్వే వివరాలను తాజాగా ప్రచురించింది. ఇక సర్వే చేయబడ్డ మహిళల్లో 64 శాతం మంది తమ భర్తలతో శృంగార జీవితాన్ని సరిగ్గా ఎంజాయ్‌ చేయలేకపోతున్నామని తెలిపారు. వారిలో 76 శాతం మంది బాగా చదువుకున్న వారు కాగా, 72 శాతం మంది ఆర్థికంగా స్వతంత్రత కలిగి ఉన్నవారని వెల్లడైంది.

2020లోనే గ్లీడెన్‌ మరో సర్వే చేయగా అందులో 55 శాతం మంది తమ లైఫ్‌ పార్ట్‌నర్స్‌ను మోసం చేసినట్లు అంగీకరించారు. వారిలో 56 శాతం మంది మహిళలే ఉన్నారు. 25 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న 1525 మందిపై ఆ సర్వే చేశారు. అందులో 48 శాతం మంది ఒకరి కన్నా ఎక్కువ మందితో ప్రేమలో ఉన్నట్లు అంగీకరించారు. అయితే రానున్న రోజుల్లో ఈ పరిస్థితి ఇంకెలా మారుతుందో చూడాలని విశ్లేషకులు అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news