విదేశాలకు సోనియా, రాహుల్.. పార్ల‌మెంటు సమావేశాలకు దూరం..!

కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఎంపీ రాహుల్‌గాంధీ పార్లమెంట్ వ‌ర్షాకాల సమావేశాలకు దూరంగా ఉండనున్నారు. వచ్చే సోమవారం నుంచి ప్రారంభ‌మ‌య్యే పార్ల‌మెంటు స‌మావేశాల‌కు వారు అందుబాటులో ఉండ‌టంలేదు. ఎందుకంటే వైద్యచికిత్స కోసం సోనియాగాంధీ త‌న త‌న‌యుడు రాహుల్‌గాంధీతో క‌లిసి విదేశాలకు వెళ్లారు. అన్ని చెక‌ప్‌లు పూర్తయ్యి సోనియాగాంధీ తిరిగిరావడానికి కనీసం రెండు వారాలు పట్టనున్నట్టు సమాచారం.

అయితే ఇప్పటికే పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ పార్లమెంటరీ నేతలతో సోనియా గాంధీ చర్చించినట్టు సమాచారం.. అలాగే సభల్లో లేవనెత్తాలసిన అంశాలపై వారికి దిశనిర్ధేశం చేసినట్టు తెలుస్తుంది. ఇకపోతే సోనియా గాంధీ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలిసిందే.