IPL 2023 : ఇవాళ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ మధ్య పోరు

-

ఐపిఎల్ 2023 లో భాగంగా ఇవాళ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య పోరు జరగనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇవాళ రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది. ఇక ఇందులో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కంటే హైదరాబాద్ జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. ఢిల్లీ కంటే హైదరాబాద్ జట్టు రెండు మ్యాచ్లు ఎక్కువగా గెలిచి ఉంది.

అటు బ్యాటింగ్ లైన్ అప్, ఇటు బౌలింగ్ లోను హైదరాబాద్ చాలా బలంగా ఉంది. అయితే తన చివరి మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించి చాలా ఉత్సాహంగా ఉంది. తమ విజయ పరంపరను అలాగే కొనసాగించాలని కసితో… హైదరాబాద్ పై పోరుకు రెడీ అయింది. ఇక ఇందులో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ చేస్తే విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని పిచ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news