ప్రజా సమస్యలపై నిరంతరం మాట్లాడే ముఖ్యమంత్రి ఆయన..తాజాగా ఓ కుర్రాడు తన బాధ చెప్పుకునేందుకు చెన్నయ్ కు పోయాడు. ఓ నేతకు ప్రాంతాలకు అతీతంగా వచ్చే మద్దతే గొప్పది. ఆ విధంగా స్టాలిన్ ఇప్పుడు ఆంధ్రాలోనూ హీరోనే!
పొరుగు ముఖ్యమంత్రి స్టాలిన్ కు ఆంధ్రాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది.అందుకే ఆయనకు ఇక్కడ కూడా మంచి మద్దతు లభిస్తోంది.దేశ వ్యాప్తంగా నీట్ పరీక్షను రద్దు చేయాలని స్టాలిన్ పోరాడుతున్నారు. ఆ పోరాటం కారణంగా అనేక మంది ఆయనకు అభిమానులుగా మారిపోతున్నారు. ఇదే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో కూడా హాట్ టాపిక్ గా మారింది. స్టాలిన్ తరఫున వినిపించే గొంతుక రేపటి వేళ సత్ఫలితాలు ఇవ్వాలని కోరుకుంటూ ఓ ఆంధ్రా కుర్రాడుచెన్నయ్ కు వెళ్లాడు. టీటీకే రోడ్డు దగ్గర నిల్చొని సీఎం కోసం నిరీక్షించి అనుకున్నది సాధించి, ఆనందించాడు. ఎంతటి సామాన్యుడినయినా కలిసే సీఎం స్టాలిన్.. ఆ క్రమంలో ఇవాళ ఆంధ్రా బిడ్డలంతా ఆయనకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నారు.
తమిళనాడు సీఎం స్టాలిన్ ఎంతో ప్రత్యేక రీతిలో పాలన అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలపై ఆయన మాట్లాడే విధానం, స్పందించే విధానం ఎంతో బాగుంటున్నాయి. దేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరి కన్నా స్టాలిన్ చేపడుతున్న పాలన పర సంస్కరణలు అన్నీ బాగుంటున్నాయి.అందుకే ఆయన దక్షిణాది రాష్ట్రాలకు ఇవాళ పెద్ద దిక్కుగా మారారు. అనేక విషయాల్లో ఆయన పోరాడుతున్నారు. అందులో నీట్ రద్దు ఒకటి. దీనిపై ఇప్పటికే తన వ్యతిరేక గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి వేళ ఓ ఆసక్తిదాయక ఘటన చోటు చేసుకుంది. అదేంటంటే….
టీటీకే రోడ్డులో ఆంధ్రాకు చెందిన ఓ విద్యార్థి ప్లకార్డు పట్టుకుని నిల్చొని ఉన్నాడు.అటుగా వెళ్తున్న స్టాలిన్ కాన్వాయ్ ను ఆపి విద్యార్థిని పిలిపించి మాట్లాడారు.అతడు ఓ ఆంధ్రా విద్యార్థి. ఊరు : తూర్పు గోదావరి, పేరు : ఎన్.సతీశ్ .. ఆ కుర్రాడితో మాట్లాడారు. అతను ఆంధ్రా విద్యార్థి తాను నీట్ పరీక్ష రాశానని, అయినా కూడా మంచి మార్కులు వచ్చినా, నీట్ కారణంగా తనకు వైద్య విద్య అభ్యసించేందుకు సీటు రాలేదని అన్నారు.దీనిపై పోరాడేందుకు స్టాలిన్ ఇవాళ సిద్ధంగా ఉన్నారు. అందుకే ఆ కుర్రాడు స్టాలిన్ కలిసి తమ తరఫున పోరాడుతున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. మీరు నిశ్చింతగాఇంటికి వెళ్లండి నేను జాతీయ స్థాయిలో మీ వాదన వినిపిస్తాను అని చెప్పి ఆ కుర్రాడిని పంపాను సీఎం. దీంతో స్టాలిన్ పై ప్రశంసల వాన కురుస్తోంది.