IPL 2023 : 3 ఏళ్ల తర్వాత ఇవాళ హైదరాబాద్ లో SRH మ్యాచ్ జరుగనుంది. ఇవాళ మధ్యాహ్నం 3.30 గంటలకు సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ జట్ల మధ్య నాలుగో మ్యాచ్ జరుగనుంది. ఈ తరుణంలో ఉప్పల్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే, క్రికెట్ అభిమానుల కోసం ప్రభుత్వం ఒక శుభవార్త చెప్పింది. ఆదివారం జరిగే మ్యాచ్ సందర్భంగా మెట్రో రైళ్ల సంఖ్యను పెంచాలని నిర్ణయించినాట్లు తెలిపింది ప్రభుత్వం.
రద్దీ కారణంగా నాగోల్-అమీర్‌పేట మార్గంలో ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు.మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఎక్కువ సంఖ్యలో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. మరో వైపు ఉప్పల్ మ్యాచ్‌కు ఏర్పాట్లన్నీ ముగిసాయి. ఇంకో వైపు ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దాదాపు 1500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్లు తెలిపారు. స్టేడియం లోపల, వెలుపల 340 సీసీకెమెరాలను ఏర్పాటు చేశామని, అలాగే జాయింట్ కమాండ్, కంట్రోల్ రూంను సైతం ఏర్పాటు చేసినట్లు వివరించారు.