అప్పుడే రీటెస్ట్‌కు ఆదేశిస్తాం.. నీట్‌పై సుప్రీంకోర్టులో విచారణ

-

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్‌ – యూజీ పేపర్‌ లీకేజీ వ్యవహారంపై ఈరోజు సుప్రీంకోర్టు లో విచారణ జరుగుతోంది. రేపటి నుంచి విచారణ జరపాలని సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టును కోరగా.. లక్షల మంది విద్యార్థులు కోర్టు తీర్పు కోసం వేచి చూస్తున్నారని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ అన్నారు. ఈరోజు వాదనలు ప్రారంభిస్తే.. రేపు కూడా కొనసాగించవచ్చని తెలిపారు.

ఈ నేపథ్యంలో విస్తృత స్థాయిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నదని గుర్తిస్తేనే రీటెస్ట్‌కు ఆదేశించగలమని ఈ సందర్భంగా సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే పిటిషనర్లకు వచ్చిన కనీస మార్కులపై సమాచారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. సొలిసిటర్ జనరల్‌ వెల్లడించిన వివరాల ప్రకారం.. 131 మంది విద్యార్థులు మాత్రమే రీటెస్ట్‌ కోరుతున్నారు.

మరోవైపు నీట్ యూజీ పేపర్ లీక్ ప్రధాన నిందితుడిని కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) అరెస్ట్ చేసింది. ఝార్ఖండ్ హజారీబాగ్లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి ప్రశ్నాపత్రాన్ని దొంగిలించిన పంకజ్ కుమార్ను సీబీఐ అదుపులోకి తీసుకుంది. ఇతడితో పాటు పేపర్ లీక్కు సహకరించిన మరో వ్యక్తిని సీబీఐ అరెస్ట్ చేసింది. దీంతో ఇప్పటివరకు పేపర్ లీక్ కేసులో అరెస్టైన వారి సంఖ్య 14కు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news