బీజేపీ పార్టీ మహిళా నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగానే కాకుండా, ముస్లిం దేశాలలో కూడా నిరసన జ్వాలలు రగుల్చుతున్నాయి. అయితే ఇప్పటికే ముస్లింలు వివిధ రాష్ట్రాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. ఇటీవల యూపీల ఈ విషయమై అల్లర్లు చెలరేగాయి.
ఇక ఇటు రెండు రోజుల కిందట.. నుపూర్ శర్మకు మద్దతుగా.. పోస్ట్ పెట్టిన ఓ వ్యక్తిని ఉదయ్ పూర్ లో ముస్లింలు హత్య చేశారు. అయితే.. తాజాగా… బీజేపీ పార్టీ మహిళా నేత నుపూర్ శర్మ పై సుప్రీం కోర్టు సీరియస్ అయింది.
బీజేపీ పార్టీ మహిళా నేత నుపూర్ శర్మ చేసిన వ్యాఖ్యల కారణంగా.. ఇలాంటి అల్లర్లు, సంఘటనలు జరుగుతున్నాయని సుప్రీం పేర్కొంది. వెంటనే.. నుపూర్ శర్మ క్షమాపణలు చెప్పాల్సిందేనని పేర్కొంది. అలాగే… ఢిల్లీ పోలీసులపై కూడా సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుతున్నా.. ఆమై చర్యలు ఎందుకు తీసుకోలేదని నిలదీసింది సుప్రీం కోర్టు. మీడియా ద్వారా నుపూర్ శర్మ క్షమాపణలు చెప్పాల్సిందేనని అక్షింతలు వేసింది సుప్రీం కోర్టు.