ప్రభుత్వాలు ఏం చేయాలో/ఏం చేయొద్దో చెప్పే బాధ్యత కోర్టులది కాదు : సుప్రీం కోర్టు

-

ప్రభుత్వాలు ఏం చేయాలో, ఏం చేయకూడదో చెప్పే బాధ్యత కోర్టులది కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కొన్ని ప్రభుత్వ విషయాల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవని వ్యాఖ్యానించింది. ప్రభుత్వాలకు దిశా నిర్దేశం చేసేందుకు కోర్టులు సరైన వేదికలు కావని అభిప్రాయపడింది.

భారత రాజ్యాంగ స్ఫూర్తి ప్రజలందరికీ తెలియడం కోసం దాని ప్రవేశిక(పీఠిక)ను స్థానిక భాషల్లో బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రదర్శించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలన్న పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఏమి చేయాలో, ఎలా చేయాలో వంటి అంశాలను ప్రభుత్వాలకు వదిలేయాలని, న్యాయస్థానం జోక్యం చేసుకోజాలదని జస్టిస్‌ ఎస్‌.కె.కౌల్‌, జస్టిస్‌ ఎ.ఎస్‌.ఓకా ధర్మాసనం స్పష్టం చేసింది.

పిటిషనర్‌ అహ్మద్‌ పిర్జాది తరఫు న్యాయవాది వ్యాజ్యాన్ని వెనక్కు తీసుకునేందుకు అంగీకరించారు. హింస, విద్వేషం, మతపరమైన అసహనం పెరిగిపోతున్న నేపథ్యంలో దేశ పౌరులందరికీ రాజ్యాంగంలో పేర్కొన్న సౌభ్రాతృత్వం, సమానత్వం, లౌకికతత్వం గురించి తెలియాల్సి ఉందని పిటిషనర్‌ అభిప్రాయపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news