మద్యం నిషేధం కోసం వేసిన పిల్ పై విచారణకు సుప్రీం విముఖత

-

జాతీయ స్థాయిలో మద్య నిషేధ విధానాన్ని తీసుకువచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీం కోర్టు విముఖత చూపింది. రాష్ట్రాలు తమంతట తాముగా నియంత్రిస్తున్నందున జాతీయ స్థాయిలో మద్యపాన నిషేధ విధానాన్ని రూపొందించేలా కేంద్రానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ యూయూ లలిత్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. మద్యం విధానం కేంద్ర, రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది గుర్తు చేశారు. రాష్ట్రాలు తమ సొంత చట్టాలను రూపొందించుకుంటాయని.. కేంద్రం జోక్యం చేసుకోవడం లేదని పిటిషనర్ న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

“మద్యం విధానం.. ప్రభుత్వ ఆదాయ మార్గానికి అనుసంధానమై ఉంది. కొన్ని సందర్భాల్లో ఏదైనా జరిగితే ప్రభుత్వ ఆదాయాన్ని నియంత్రిస్తారు. మద్యం ద్వారా వస్తున్న ఆదాయం.. సామాజిక ప్రయోజనాల కోసం కూడా ఉపయోగపడుతుంది. ఈ అభ్యర్ధన ప్రభుత్వానికి ఒక విధానాన్ని కలిగి ఉండాలని నిర్దేశించడం లాంటిది. ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదు. విచారణలో అనేక నివేదికలను ఉదహరించడం, దీనికి కేంద్రం మరోలా స్పందించడం.. ఈ రకమైన విషయాలు మీకు వినోదభరితంగా ఉంటాయి. ఈ విషయంలో జోక్యం చేసుకోవడం సబబు అనిపించడం లేదు. మీకు కావలసినది మీరు చేయవచ్చు.

– సుప్రీంకోర్టు

Read more RELATED
Recommended to you

Exit mobile version