వృద్ధులకు సకాలంలో పింఛను పంపిణీ చేయండి: సుప్రీం కోర్ట్

-

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్న నేపథ్యంలో వృద్ధులకు సకాలంలో పింఛను పంపిణీ చేయాలని సంబంధిత అధికారులకు సూచించింది సుప్రీంకోర్టు. అలాగే వృద్ధాశ్రమాల్లో నివసిస్తున్నవారికి పీపీఈ కిట్లు, మాస్క్​లు, శానిటైజర్లు అందించాలని తెలిపింది. కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ న్యాయవాది అశ్వనీ​ కుమార్​ దాఖలు చేసిన పిటిషన్​ను స్వీకరించిన జస్టిస్​ అశోక్​ భూషణ్​ నేతృత్వంలోని ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యానించింది. దేశంలో కోట్లాది మంది వృద్ధులు కరోనా కారణంగా తలెత్తిన సంక్షోభ కాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారికి ఈ సమయంలో మాస్క్​లు, శానిటైజర్లు, పీపీఈ కిట్లు అవసరం మేరకు అందించాలని దిశానిర్దేశం చేసింది అత్యున్నత న్యాయస్థానం.

supreme court
supreme court

కరోనా మహమ్మారి వలన వలస కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీరి కష్టాలపై కూడా సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలైంది. కానీ అత్యున్నత న్యాయస్థానం ఈ మేరకు దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే మరి.

Read more RELATED
Recommended to you

Latest news