భారత్‌లో అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ మరోసారి తన స్థానాన్ని పదిలం చేసుకుంది. ఈ విషయాన్ని బ్రాండ్ ఫైనాన్స్ తాజా నివేదికలో పేర్కొంది. ఈ గ్రూప్ బ్రాండ్ విలువ 2022తో పోలిస్తే 10.3% వృద్ధి చెంది 26.38 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.2.16 లక్షల కోట్ల)కు చేరింది. 25 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన ఏకైక భారతీయ బ్రాండ్‌గానూ టాటా గ్రూప్ అవతరించింది.
బ్రాండ్ ఫైనాన్స్ 500 సంస్థలతో రూపొందించిన ఈ జాబితా ప్రకారం.. అగ్రగామి 100 కంపెనీల్లో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ బ్రాండ్ టాటా గ్రూప్ మాత్రమే. 13 బిలియన్ డాలర్లతో భారత బ్రాండ్లలో ఇన్ఫోసిస్ రెండో స్థానంలో కొనసాగుతోంది. ఎయిర్‌టెల్ 4వ స్థానంలో ఉండగా.. 11వ స్థానంలో జియో గ్రూప్ నిలిచింది. బ్యాంకుల్లో ఎస్‌బీఐ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాతి స్థానాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి. భారత్‌లో అత్యంత వేగవంతమైన ఆటోమొబైల్ బ్రాండ్‌గా.. అంతర్జాతీయంగా అత్యంత వేగవంతమైన టాప్-10 ఆటోమొబైల్ బ్రాండ్‌గా నిలిచింది.