రెజ్లర్ల నిరసనకు టీమిండియా మద్దతు

-

భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ తమను లైంగికంగా వేధించాడని ఆరోపిస్తూ గత కొద్ది నెలలుగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారికి దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలు మద్దతునిస్తున్నాయి. తాజాగా రెజ్లర్ల ఆందోళనపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. వారికి తన మద్దతు ప్రకటిస్తున్నట్లు చెప్పారు. రెజ్లర్లను లైంగికంగా వేధించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్‌భూషణ్‌పై..ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కేంద్ర ప్రభుత్వాన్ని కవిత ప్రశ్నించారు.

ఇది ఇలా వుండగా, తాజాగా, మహిళా రెజ్లర్లకు మద్దతుగా 1983 కపిల్ దేవ్ క్రికెట్ టీమ్… రంగం లోకి దిగింది. 1983 ప్రపంచకప్ గెలిచిన భారత క్రికెట్ జట్టు సభ్యులు రెజ్లర్లకు మద్దతుగా మీడియా ప్రకటన విడుదల చేశారు. రెజ్లర్లకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామని… కపిల్ దేవ్ టీం స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news