టీమిండియా క్రికెటర్, కెప్టెన్ రోహిత్ శర్మకు బిగ్ షాక్ తగులనుంది. టీమిండియా కెప్టెన్ గా రహానే ఎంపిక కానున్నారు. జూలై 12న ఆరంభమయ్యే వెస్టిండీస్ పర్యటనలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టుల్లో విశ్రాంతి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఐపీఎల్-16లో 16 మ్యాచుల్లో 332 పరుగులే సాధించిన రోహిత్… తాజాగా ఆస్ట్రేలియాతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో తొలి ఇన్నింగ్స్ లో 15, రెండో ఇన్నింగ్స్ లో 43 పరుగులే చేయగలిగాడు. ఫామ్ లేమికి తోడు విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్న నేపథ్యంలో విండీస్ పర్యటన నుంచి అతడిని దూరం పెట్టాలని సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే టెస్టుల్లో అజింక్య రహానే… జట్టును నడిపించనున్నాడు. 2022లో కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాక… భారత్ 10 టెస్టులు ఆడితే రోహిత్ మూడింటిలో గైర్హాజరయ్యాడు.