నేడే నీతి ఆయోగ్ సమావేశం.. బహిష్కరించిన రాష్ట్రాలు ఇవే

-

ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్‌ 9వ పాలకమండలి సమావేశం ఇవాళ ఉదయం రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరగనుంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడంపై దృష్టిసారిస్తూ రూపొందించిన ‘వికసిత భారత్‌ 2047’ అజెండాపై ఈ భేటీలో చర్చించనున్నారు. కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు దీన్ని బహిష్కరించాలని నిర్ణయించడంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితోపాటు కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంలు సిద్దరామయ్య, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖూ ఇందులో పాల్గొనడం లేదు.

మరోవైపు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్‌ సీఎం భగవంత్‌ మాన్‌ ఈ సమావేశానికి దూరంగా ఉండనున్నట్లు తెలిసింది. ఇక ఈ సమావేశానికి హాజరుకావడానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం రాత్రి దిల్లీ చేరుకున్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి కేటాయింపుల్లో తీవ్ర అన్యాయం జరిగిందని, ఈ నేపథ్యంలో నీతి ఆయోగ్‌ సమావేశంలో పాల్గొనడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని భావించి, ఈ సమావేశానికి దూరంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

Read more RELATED
Recommended to you

Latest news