జమ్ముకశ్మీర్లో ఉగ్రదాడి.. ఐదుగురు జవాన్లు మృతి

-

జమ్ముకశ్మీర్‌లోని కథువాలో జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఆరుగురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. భారత ఆర్మీ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడటంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కథువా జిల్లాలోని మాచేడి ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో నలుగురు జవాన్లు వీరమరణం పొందగా.. వెంటనే భద్రతాబలగాలు తిప్పికొట్టేందుకు యత్నించారు. ఈ క్రమంలో ముష్కరులు అడవుల్లోకి పారిపోయారు. సాధారణ ప్యాట్రోలింగ్‌ నిర్వహిస్తున్న సమయంలో ఈ దాడి చోటుచేసుకున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ముష్కరుల కోసం వేట కొనసాగుతోందని వెల్లడించారు.

జమ్మూలో గడిచిన 48 గంటల్లో సైన్యంపై జరిగిన రెండో దాడి ఇది. ఆదివారం తెల్లవారు జామున రాజౌరీ వద్ద మాఝకోట్‌ సైనిక శిబిరంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డ విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ సైనికుడికి గాయాలయ్యాయి. సైనికులు ఎదురుకాల్పులు జరపడంతో చీకట్లో ఉగ్రవాదులు పరారయ్యారు. మరోపక్క కుల్గామ్ జిల్లాలో 2 రోజులుగా 2 గ్రామాల్లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్లలో ఆరుగురు మృతి చెందారు. శనివారం ప్రారంభమైన ఈ ఎన్‌కౌంటర్లలో ఇద్దరు జవాన్లు అమరులైనట్లు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news