ఆధార్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా చాలా చోట్ల ఆధార్ చట్టం ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ఈ ఉల్లంఘనలకు చెక్ పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇక పై ఎవరు అయినా ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించక కుండా చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ఇప్పటి వరకు ఆధార్ వ్యవస్థ ను నిర్వహిస్తున్న యూఐడీఏఐ (యునిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా) కు కొన్ని అధికారాలు ఇచ్చింది.
వీటి ప్రకారం ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై జరిమానా వేసే అధికారం యూఐడీఏఐ కు ఉంటుంది. ఆ జరిమానా కు దాదాపు కోటి రూపాయల వరకు విధించే అధికారం యూఐడీఏఐ కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఇలాంటి అధికారాలను యూఐఏడీఐ కు కల్పిస్తు కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆధార్ యూజర్ల డేటకు రక్షణ మరింత లభిస్తుందని పలువురు మేధావులు అభిప్రాయ పడుతున్నారు.