కోతి పిల్లను చంపాయన్న పగతో 250 కుక్కు పిల్లలను కోతులు చంపిన ఘటన తెలిసిందే. ఈ ఘటన నాగ్ పూర్ లోని మజల్ గావ్ లో జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే కుక్కు పిల్లలు లేకపోవడం తో స్కూల్ కు వెళ్తున్న చిన్న పిల్లలపై కోతులు దాడి చేయడం తో అటవీ శాఖ అధికారులు రంగం లోకి దిగారు. కోతు లలో ముఖ్యమైన రెండు కొండ ముచ్చులను అతి కష్టం మీద బంధించారు.
దీంతో కోతులకు, కుక్కలకు మధ్య నడుస్తున్న గ్యాంగ్ వార్ కు బ్రేక్ పడింది. అయితే కోతులు ఆ గ్రామంలో ఒక్క కుక్క లేకుంటా చేశాయని గ్రామస్తులు తెలిపారు. రెండు కోతులను పట్టుకుని బంధించినా.. పిల్లలను స్కూల్ కు పంపిచడానికి తల్లి దండ్రులు జంకుతున్నారు. మళ్లీ కోతులు తమ గ్రామంలోకి వస్తాయని అన్ని కోతులను పట్టుకుని అటవీ ప్రాంతంలో విడిచి పెట్టాలని అధికారులను కోరుతున్నారు.