తెలంగాణలో కొత్తగా 134 కరోనా కేసులు…ఒకరు మృతి

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి కేసులు క్ర‌మ క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న పెరిగిన క‌రోనా కేసులు.. ఇవాళ కాస్త తగ్గాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్ ప్ర‌కారం.. గ‌డిచిన 24 గంట‌ల‌లో కొత్త గా 134 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. దీంతో తెలంగాణ లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా కేసుల సంఖ్య 6,79,564 కి చేరింది.

అలాగే రాష్ట్రం లో గ‌డిచిన 24 గంట‌ల లో క‌రోనా మ‌హ‌మ్మరి కాటు కు ఒక్క‌రు మృతి చెందారు. దీంతో తెలంగాణ రాష్ట్రం లో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణం గా 4,015 మంది మ‌ర‌ణించారు. అలాగే ఈ రోజు కరోనా వైర‌స్ ను 201 మంది క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్నారు. దీంతో రాష్ట్రం లో క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 6,71,856 కి చేరింది. కాగ ఇప్ప‌టి వ‌ర‌కు తెలంగాణ రాష్ట్రం లో 98.86 శాతం తో రీక‌వ‌రీ రేటు ఉంది. అలాగే రాష్ట్రం లో ప్ర‌స్తుతం 3,693 ​యాక్టివ్ కేసులు ఉన్నాయి.