నేడు బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం జరగనున్నది. పార్లమెంట్ అనెక్స్ భవనంలో జరిగే ఈ సమావేశానికి హాజరు కావలసిందిగా లోక్సభ, రాజ్యసభ సభ్యులకు పార్టీ నాయకత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ భేటీలో ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. తమ అభ్యర్థి పై ప్రతిపక్షాల నుంచి మద్దతు కోరే ప్రణాళిక ఉండనున్నట్లు తెలుస్తోంది. ఉపరాష్ట్రపతిగా ఉత్తర భారతానికి చెందిన ఓబిసి లేదా అప్పర్ క్యాస్ట్ నేతను ఎంపిక చేసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ సమావేశం తరువాత ఉప రాష్ట్రపతి అభ్యర్థి పేరును అధికారికంగా ఎన్డీఏ తరఫున ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్లమెంటరీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్నందున ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేయనుంది. ఈ సమావేశాల్లో ప్రభుత్వం తరఫున ప్రవేశపెట్టనున్న బిల్లులు, వాటిపై జరిగే చర్చలో పాల్గొనే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నది.