ఆన్ లైన్ జనాలకు అడ్డంగా దొరికిన మోడీ… వాయించేస్తున్నారు!

-

అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా… ప్రతీ రాజకీయ నాయకుడికి రెండేసి నాలుకలు ఉంటాయనే విమర్శకు బలం చేకూరుస్తూ.. తాజాగా ఒక ట్వీట్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తుంది. అది మరెవరిదో అయితే అంత హడావిది ఉండేది కాదేమో కానీ… ఆ ట్వీట్ స్వయంగా దేశ ప్రధాని మోడీది! దీంతో నెటిజన్లు ఆ ట్వీట్ ను పెట్టి ఆన్ లైన్ వేదికగా మోడీపై విమర్శల వర్షాలు కురిపిస్తున్నారు.

అది 2012 జూన్ 27.. నాడు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ ట్విట్టర్ లో స్పందించారు. నాడు దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తోంది. ఈ క్రమంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్రమోడీ ఓ ట్వీట్ చేశారు. “దేశంలో పెట్రోల్ రేట్లను పెంచుతో కాంగ్రెస్ ప్రభుత్వం కోట్లు కొల్లగొడుతోంది.. ఇది ప్రజలపై పెను భారాన్ని మిగులుస్తోంది.. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందానికి పెట్రో ధరల పెంపే ప్రాదమిక నిదర్శనమం” అంటూ నాడు గుజరాత్ సీఎంగా మోడీ ట్వీటారు.

ఇప్పుడు ఆ పాత ట్వీట్ నే కొందరు నెటిజన్లు బయటకు తీశారు. “నాడు కాంగ్రెస్ పార్టీ పెట్రోల్ ధరలు పెంచింది… మరి ఇప్పుడు మీరు చేసుంది ఏమిటి… వరుసగా మూడు వారలనుంచి పెట్రోల్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు… పెట్రోల్ ధరలు రౌండ్ ఫిగర్ చేసేవరకూ ఈ ఉద్యమం ఆపేలా లేరు… మీ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని చెప్పడానికి ఈ వరుస పెట్రో ధరల పెంపే నిదర్శనం… అంటూ మోడీని ఎండగడుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ట్వీట్ హాట్ టాపిక్!

Read more RELATED
Recommended to you

Latest news