తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు
ఈ మాట కాంగ్రెస్ కే కాదు దేశంలో ఉన్న
అన్ని ఉన్నత శ్రేణీ రాజకీయ పార్టీలకూ వర్తిస్తంది
బీజేపీ అవినీతిపై కాంగ్రెస్ మాట్లాడు’తుంది కానీ నిరూపించడం లేదు.అదేవిధంగాద కాంగ్రెస్ అవినీతిపై బీజేపీ జస్ట్ ఒక ప్రకటన చేస్తుంది అంతేకానీ వాటిపై న్యాయ విచారణ అయితే చేయించదు.అందుకు బీజేపీ అధినాయత్వానికి మనసే రాదు.అలాంటప్పుడు బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ ఏం మాట్లాడినా అందులో నిజాయితీ లేదనే గుర్తించాలి. లేదా ద కశ్మీర్ ఫైల్స్ లాంటి మరో సినిమా ను కాంగ్రెస్ రూపొంచించి, ఏడున్నరేళ్ల కాలంలో బీజేపీ ఏం చేసిందో జాతికి కళ్లకు కట్టిన విధం గా వివరించగలగాలి. ఈ రెండూ లేనప్పుడు కాంగ్రెస్ మాటలు నీటి రాతలతో సమానం.
ఒక్క సినిమాతో బీజేపీ సంపాదించుకునేందుకు ఏమీ ఉండదు. ఆ మాటకు వస్తే అదే ఒక్క సినిమాను విమర్శించి రచ్చకెక్కినంత మాత్రాన కాంగ్రెస్ కూడా సాధించేది కానీ సంపాదించేది కానీ ఏమీ ఉండదు. రాజకీయాల్లో ఉన్నారు కనుక బీజేపీ సమర్థించే వాటిపై సహజంగానే కాంగ్రెస్ కానీ తెలంగాణ రాష్ట్ర సమితి కానీ వ్యతిరేకిస్తాయి. ఇదే వ్యతిరేకతలను కమ్యూనిస్టులూ తమదైన శైలిలో వినిపిస్తూనే ఉన్నారు. కనుక గెలుపు ఓటములపై ఒకనాడు సినిమాల ప్రభావం ఉన్నా నేడు ఓటర్లు విచక్షణకు, ప్రజలు తమ మనో బుద్ధి కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కనుక కాంగ్రెస్ వ్యతిరేకించినంత మాత్రాన బీజేపీ నష్టపోదు. బీజేపీ తనదైన పంథాలో కాంగ్రెస్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చినంత మాత్రాన రాత్రికి రాత్రి పరిణామాలు ఏం మారిపోవు. ఎవరి స్థాయి వారిదే! ఎవరి గెలుపు కూడా వారిదే! ఓటమి అయినా గెలుపు అయినా సంబంధిత రాజకీయం అన్నది ఇప్పట్లో తేలదు.కొనసాగుతూనే ఉంటుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ద కశ్మీర్ ఫైల్స్ సినిమాపై కాంగ్రెస్ కాస్త అతి చేస్తుందా అన్న వాదన కూడా ఉంది.ఇదే సమయంలో ఈ సినిమాను బీజేపీ కి అనుగుణంగానో, అనుబంధంగానో మలిచేందుకు చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు మాట కూడా వినవస్తోంది. ఈ తరుణంలో కాంగ్రెస్ కేవలం ఈ ఇష్యూని రాజకీయంగా గేమ్ లో భాగంగా వాడుకుంటే తరువాత కాలంలో ఆ పార్టీకి కూడా ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే కాంగ్రెస్ హయాంలోనూ ఎన్నో తప్పులు జరిగాయి. వాటిని దిద్దుకునే పని అయితే చేయలేదు. మోడీ కన్నా కాంగ్రెస్ బెటర్ అని చాలా మంది జనాలను నమ్మిస్తూ రాజకీయం చేస్తే చేయొచ్చుగాక కానీ ఈ సినిమా వల్ల తమకు కొత్తగా వచ్చే మైలేజ్ ఏమీ లేదనే బీజేపీ అంటోంది.అయినా ఒక సినిమాను నాలుగు ఓట్లు రాలుతాయి అని అనుకోవడం మూర్ఖత్వం అవుతుందన్న వాదన కూడా వినిపిస్తోంది బీజేపీ.
ట్విటర్ పోల్ : కశ్మీర్ ఫైల్స్ పై కాంగ్రెస్ అతి చేస్తుందా?#KashmirFiles #CongressParty
— Manalokam (@manalokamsocial) March 22, 2022
– ట్విటర్ పోల్ – మన లోకం ప్రత్యేకం