శివసేన అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా – ఉద్దవ్‌ థాక్రే

-

శివసేన జిల్లా అధ్యక్షుల సమావేశంలో మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ, నన్ను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని మీరు కోరుకుంటే, నేను దానిని కూడా వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఏక్నాథ్ షిండేకు నగరాభివృద్ధి వంటి కీలక శాఖ ఇచ్చామని.. గతంలో ఇది ఎప్పుడూ ముఖ్యమంత్రితో ఉండేదని గుర్తు చేశారు.

షిండే కుమారుడు కూడా పార్లమెంటు సభ్యుడు అని.. పార్టీ షిండే కు అన్ని రకాలుగా గుర్తింపు ఇచ్చిందన్నారు ఉద్ధవ్. షిండే కు తగినంత గుర్తింపు పార్టీలో ఇచ్చిన ఆయన మమ్మల్ని మోసం చేశారని.. ఛత్రపతి శివాజీ కాలంలో ప్రత్యర్థులు గ్రామాల తర్వాత గ్రామాలను యుద్ధంలో నాశనం చేసేవారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఛత్రపతి శివాజీ తనతో కలిసి ఉన్న నిజాయితీ పరులతో గ్రామాలను మళ్లీ పునర్నిర్మించారన్నారు ఉద్ధవ్. పార్టీ పునర్నిర్మాణానికి కృషి అందరం చేయాలన్న ఉద్ధవ్.. నేను పదవికి, కుర్చీకి అతుక్కుపోయే వ్యక్తిని కాదని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news