అవ్వకు బంగారు కానుక ఇచ్చిన ఎస్పీ..ఎందుకంటే?

-

ప్రజల సంరక్షణ కోసం తెలంగాణ పోలీసులు ఎప్పటికప్పుడు కొత్త కొత్త కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు.పోలీసులు రెక్కీల వల్ల రాష్ట్రంలో నేరాల రేటు పూర్తిగా తగ్గిందని తెలుస్తుంది. కేవలం దొంగలను పట్టుకోవడం మాత్రమే కాదు..ప్రజల కష్టాలను తీర్చడం లో కూడా ముందున్నారు.గతంలో కరోనా నుంచి ప్రజలను కాపాడుకునేందుకు వీర సైనికులుగా నిలిచారు.

మహమ్మారి ప్రబలకుండా అవగాహన కల్పించారు. ఎందరో పోలీసులు కరోనాకు బలి అయ్యారు..కష్టాల్లో ఉన్న ప్రజల ను ఆదుకుంటూ ముందుకు సాగుతున్నారు..ఇప్పుడు ఓ పోలీసు అధికారి మరోసారి పెద్ద మనసు ఛాటుకున్నాడు..

వివరాల్లొకి వెళితే.. తెలంగాణాలోని సిరిసిల్ల జిల్లాలోని తెనుగువారి పల్లెలో గత నెల పోలీసు నేస్తం కార్యక్రామాన్ని నిర్వహించారు..ఈ కార్యక్రమాన్ని ఎస్పీ రాహుల్ హెగ్డే ఆద్వర్యంలో నిర్వహించారు..ఆ సందర్భంగా ఓ వృద్ధురాలు ఆయన వద్దకు వచ్చింది.తన బంగారు గొలుసును ఎవరో దొంగతనం చేశారని చెప్పుకొని బోరున ఏడ్చింది.దానికి చలించి పోయిన ఆయన తనకూ గొలుసు ఇస్తానని మాట ఇచ్చాడు..సరిగ్గా నెల రోజులకు ఆయనే స్వయంగా ఆ అవ్వకు గొలుసు చేయించి ఇచ్చాడు.దానికి అవ్వ ఆనంద బాష్పాలు కార్చింది.అతడిని ఆశీర్వదించారు.. మొత్తానికి ఈ వార్త చక్కర్లు కోడుతుంది.. ఎస్పీ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news