సీఎం అధికారిక నివాసాన్ని ఖాళీ చేసిన ఉద్దవ్..కాసేపట్లోనే రాజీనామా !

మహారాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. అవసరమైతే తాను సీఎం పదవికి… రాజీనామా చేస్తానని ప్రకటించిన ఉద్దవ్.. గంటల వ్యవధిలోనే సీఎం అధికార నివాసాన్ని కాళీ చేశారు. వర్ష భవనాన్ని ఖాళీ చేసిన ఆయన తన సొంత ఇల్లు అయినా మాతో శ్రీ కి మకాం మార్చారు. కరుణ బారిన పడినప్పటికీ ఆయన అధికార నివాసాన్ని ఖాళీ చేయడం గమనార్హం.

అంతకుముందు ఎన్సీపీ నేత శరద్ పవార్… ఉద్ధవ్ థాక్రే ను కలిశారు. వారిద్దరు గంటకు పైగా చర్చించారు. శరద్ పవార్ తో భేటీ అనంతరం అధికారిక నివాసం నుంచి సూటు కేసులను సిబ్బంది బయటకు తరలించారు.

అయితే.. ఆయన బంగ్లాను ఖాళీ చేయడమే కాదు.. రాజీనామా లేఖను కూడా సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఇవాళ ఏ క్షణమైనా.. ఉద్దవ్‌ తన సీఎం పదవికి రాజీనామా చేసే ఛాన్స్‌ ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 11 గంటలకు శివసేన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు ఉద్దవ్‌.