జులై 3న కేంద్ర మంత్రిమండలి భేటీ

-

కేంద్ర మంత్రిమండలి జులై 3వ తేదీన సమావేశం కానుంది. ప్రగతి మైదాన్‌లో నూతనంగా నిర్మించిన ‘ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌’లో ఆ రోజు సాయంత్రం ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు. జులై 17 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఆలోగా కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు తెచ్చేలా విస్తరణ జరిగే అవకాశాలున్నట్లు విస్తృతంగా ప్రచారంలో ఉంది. దీనిని బలపరిచే రీతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోంమంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జె.పి.నడ్డా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బి.ఎల్‌.సంతోష్‌లు బుధవారం అర్ధరాత్రి వరకు సుదీర్ఘంగా సమావేశమయ్యారు. దీంతో అటు పార్టీలో, ఇటు మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

సాధారణంగా పార్లమెంట్‌ సమావేశాలకు ముందు కూడా మంత్రి మండలి సమావేశమవుతుంది. తాజా భేటీ మంత్రివర్గ పునర్‌ వ్యవస్థీకరణకా? ఎప్పటి మాదిరిగా పార్లమెంటు సమావేశాల కోసమా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే..!

Read more RELATED
Recommended to you

Latest news