అన్ లాక్ కొత్త నిబంధనలు.. నవంబర్​ నెలాఖరు దాకా అంతే !

-

కరోనా కట్టడికి విధించిన “లాక్‌డౌన్‌”కు సడలింపులు ఇస్తూ సెప్టెంబర్‌లో ప్రకటించిన అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కంటైన్మెంట్‌ జోన్ల వెలుపల సినిమా థియేటర్లు, మల్టీ ప్లెక్స్‌లకు 50 శాతం సీట్లతో అనుమతించడంతో సహా అన్‌లాక్‌ 5.0 మార్గదర్శకాలు నవంబర్‌ 30 వరకూ అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. కరోనా ముప్పు ఇంకా ఉన్నందున మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్రాలకు కేంద్రం సూచనలు చేసింది.

కంటైన్మెంట్‌ జోన్లలో లాక్‌ డౌన్‌ నిబంధనలు కఠినతరం చేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రభుత్వం అనుమతించిన సేవలు మినహా, అంతర్జాతీయ విమాన సర్వీసుల నిలిపివేత యధావిధిగా కొనసాగుతాయని వెల్లడించింది. అయితే దశల వారీగా స్కూళ్లు, విద్యాసంస్ధలను తెరవడంపై రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిర్ణయం తీసుకునే వెసులుబాటు కల్పించింది. ఇందుకు ప్రత్యేక అనుమతులు అవసరం లేదని కేంద్ర హోంశాఖ స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news