యూపీఐ ట్రాన్సక్షన్ విఫలమైందా..? అయితే ప్రతిరోజు రూ.100 పొందండిలా..!

Join Our Community
follow manalokam on social media

ప్రస్తుతం దేశంలో డిజిటల్ చెల్లింపులు పెరిగాయి. డిజిటల్ లావాదేవీలు పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అయితే కొత్త ఆర్థిక సంవత్సరంలోకి అడుగు పెట్టిన రోజు (ఏప్రిల్ 1) ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకులు మూసివేయబడ్డాయి. బ్యాంకుల మూసివేత కారణంగా చాలా మంది వినియోగదారులు డిజిటల్ పేమెంట్స్ చేశారు. ఈ సమయంలో ఎన్ఈఎఫ్‌టీ, ఐఎంపీఎస్, యూపీఐ ద్వారా డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేయడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చాలా మంది వినియోగదారుల యూపీఐ ట్రాన్సక్షన్స్ విఫలమయ్యాయి. అయితే తాజాగా ఒక ప్రకటన వెలువడింది. యూపీఐ పేమెంట్స్ చేసిన తర్వాత వినియోగదారుల ఖాతా నుంచి డబ్బులు డిడక్ట్ అయిన తర్వాత నిర్ణీత సమయంలో బ్యాంకు డబ్బులు తిరిగి చెల్లించకపోతే.. కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయడం ద్వారా ప్రతిరోజు రూ.100 పరిహారం పొందవచ్చు.

UPI-Cash
UPI-Cash

2019 సెప్టెంబర్‌లో రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) డబ్బులు డిడక్ట్ అయి ట్రాన్సక్షన్ క్యాన్సల్ అయ్యే దానిపై కొత్త సర్క్యూలర్ జారీ చేసింది. దీని ప్రకారం.. నిర్ణీత కాలపరిమితిలో లావాదేవీల పరిష్కారం, డబ్బులు ఖాతాలో జమ కాకపోవడం వంటివి జరిగినప్పుడు బ్యాంకు ఆ వినియోగదారుడికి పరిహారం చెల్లించాలి. యూపీఐ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేస్తే.. డబ్బులు చెల్లించేవరకు ప్రతిరోజు రూ.100 పరిహారం ఇవ్వాల్సి ఉంటుంది. ఈ సర్క్యూలర్ ప్రకారం.. యూపీఐ ట్రాన్సక్షన్ విఫలమై.. కస్టమర్ అకౌంట్ నుంచి డబ్బులు డిడక్ట్ అయితే టీ+1 రోజుల్లో డబ్బులు తిరిగి ఖాతాలో జమచేయాలి.

ఫిర్యాదు చేయండిలా..
వినియోగదారులు యూపీఐ ట్రాన్సక్షన్ జరిపిన తర్వాత డబ్బులు డిడక్ట్ అయి.. ట్రాన్సక్షన్ విఫలమై.. డబ్బులు తిరిగి రాకపోతే.. మీరు యూపీఐ కస్టమర్ కేర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. రేజ్ వివాదంపై మీరు ఫిర్యాదు నమోదు చేసుకోవాలి. మీ వివరాలు తెలుసుకున్న తర్వాత మీ ఫిర్యాదు సరైనదైతే ప్రొవైడర్ డబ్బులు తిరిగి చెల్లిస్తాడు. అయితే బ్యాంకులకు ఫిర్యాదు చేసినా స్పందించకపోతే ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్ స్కీమ్ ఆఫ్ డిజిటల్ లావాదేవీలు-2019 కింద ఫిర్యాదు చేసుకోవచ్చు. కాగా, ప్రతినెలా యూపీఐ పేమంట్స్ 19 శాతం పెరుగుతున్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో రూ.5 లక్షల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరిగాయి.

TOP STORIES

శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో...