IPL 2023 : కొట్టుకోబోయిన కోహ్లీ, గంభీర్.. వీడియో వైరల్

-

ఐపిఎల్ 2023 లో భాగంగా జరిగిన నిన్న జరిగిన మ్యాచ్ లో లక్నో పై బెంగళూర్ ఘన విజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న డుప్లిసిస్ సేన నిర్ణీత ఓవర్ లలో 9 2 వికెట్ల నష్టానికి 126 పరుగులు మాత్రమే చేయగలిగింది.

మొదటి నుండి పిచ్ లో వేగం లేకపోవడం తో స్పిన్నర్లు చెలరేగి పోయారు. పరుగులు చేయడం చాలా కష్టంగా మారింది. అనంతరం 127 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో మరో ఒక బంతి మిగిలి వుండగానే 108 పరుగులకు ఆల్ ఔట్ అయి 18 పరుగుల తేడాతో ఓటమి పాలయింది.

అయితే.. ఈ మ్యాచ్‌ లో విరాట్‌ కోహ్లీ, గంభీర్‌ మధ్య గొడవ చోటు చేసుకుంది. మ్యాచ్‌ అనంతరం.. టీం సభ్యులు అందరూ షేక్‌ హ్యాండ్‌ ఇచ్చుకుంటున్నారు. ఈ తరుణంలోనే.. విరాట్‌ కోహ్లీ, గంభీర్‌ మధ్య గొడవ చోటు చేసుకుంది. మాట, మాట పెరిగే.. గొడవ పెద్దగా అయింది. అయితే.. సదరు ప్లేయర్లు అడ్డుకోవడంతో.. గొడవ సద్దుమణిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news