మీకు బిగ్ సెల్యూట్ .. వయనాడ్ విలయంపై ఆర్మీకి బాలుడి లేఖ

-

కేరళలోని వయనాడ్‌లో కొండచరియలు విరిగినపడిన ఘటనలో 300లకుపైగా మంది మరణించారు. ఈ ఘటనలోమృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. వెంటనే సహాయక చర్యల్లోకి దిగిన భారత ఆర్మీ, ఎన్డీఆర్‌ఎఫ్‌, అటవీ శాఖ బృందాలు మట్టి దిబ్బల్లో, కొండ చరియల్లో చిక్కుకుపోయిన వారిని తమ ప్రాణాలకు తెగించి కాపాడుతున్నారు. అయితే ఈ విపత్కర పరిస్థితుల్లో వయనాడ్ కోసం భారత సైన్యం చేస్తున్న సాయాన్ని చూసి వారికి దేశంపై ఉన్న ప్రేమ, నిబద్ధతతను చూసి చలించిన ఓ బాలుడు ఆర్మీకి లేఖ రాశాడు.

వయనాడ్‌కు చెందిన 3వ తరగతి విద్యార్థి రాయన్ భారత ఆర్మీకి లేఖ రాశాడు.ప్రియమైన ఇండియన్‌ ఆర్మీ.. నేను పుట్టిన యనాడ్‌లో ప్రకృతి విలయం విధ్వంసం సృష్టిస్తే ఎంతో మంది ప్రజలను మీరు ప్రాణాలకు తెగించి కాపాడారు. సరైన తిండి లేకపోయినా బిస్కెట్లు తింటూ బాధితులను కాపాడడానికి వంతెనలు నిర్మిస్తున్నారు. నేను కూడా ఏదో ఒకరోజు సైన్యంలో చేరి మీలాగా దేశాన్ని రక్షిస్తాను’’ అని రాసుకొచ్చాడు. దీనిపై ఇండియన్ ఆర్మీ స్పందిస్తూ ఇలాంటి ప్రేరణ వల్ల దేశం కోసం మరింత కష్టపడి పని చేయాలనే ఇష్టం పెరుగుతుందంటూ బాలుడి లేఖపై స్పందించింది.

Read more RELATED
Recommended to you

Latest news