“జగనన్న ఇళ్ల కాలనీ”లో ఇళ్లు అమ్మబడును..షాక్‌ లో మంత్రి నాదెండ్ల !

-

“జగనన్న ఇళ్ల కాలనీ”లో ఇళ్లు అమ్మబడును అనే బోర్డు చూసి..షాక్‌ తిన్నారు మంత్రి నాదెండ్ల. తెనాలి మండ‌లం పెదరావురు గ్రామంలోని జగనన్న కాల‌నీలో ఇళ్ల నిర్మాణాల‌ని పరిశీలించారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇళ్ల నిర్మాణంలో నాణ్యత లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్…. ఇళ్ల నిర్మాణంలో కూడా వివక్షత చూపుతారా..? అని ప్రశ్నించారు.

Minister Nadendla Manohar inspected the construction of houses in Jagananna Colony in Pedarauru village of Tenali mandal

డబ్బులు ఉన్న వాడికి ఒక న్యాయం డబ్బులు లేక కట్టుకుకోలేని వాళ్ళకి ఒక న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్… ఇచ్చిన ఇళ్ల స్ధలంలో కంటే సరైన కొలతల్లో కాకుండా బాగా ముందుకు కట్టుకున్నప్ప‌టికీ ఎందుకు అనుమతి ఇస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

నాణ్యత లేకుండా ఇళ్ల నిర్మాణం చేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. జగనన్న ఇళ్ల కాలనీలో ఇళ్లు అమ్మబడును అని పెట్టిన బోర్డు ను చూసి ఆశ్చర్య పోయారు మంత్రి నాదెండ్ల మనోహర్. ఇళ్లు కాటుకున్న లబ్ధిదారులు గంజాయి తాగుతున్న యువకుల వల్ల అర్దరాత్రిల్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామ‌ని ఇక్కడ ఉండలేకపోతున్నమని మనోహర్ దృష్టికి తీసుకువెళ్లారు లబ్ధిదారులు.

Read more RELATED
Recommended to you

Latest news