అదానీ వ్యవహారంపై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేస్తామని అన్నారు బిఆర్ఎస్ ఎంపీలు. లోక్‌సభలో స్పీకర్ పొడి అని చుట్టుముట్టారు బిఆర్ఎస్ ఎంపీలు. హిడెన్‌బర్గ్ రిపోర్ట్ పై చర్చించాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు అన్యాయం చేశారని లోక్ సభలో ఆందోళన చేశారు బిఆర్ఎస్ ఎంపీలు. పార్లమెంట్ సమావేశాలలో ప్రతిపక్ష పార్టీలు వాయిదా తీర్మానం ఇచ్చినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
అదానీ తీరు, కేంద్రం వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామన్నారు. గుజరాతి వ్యాపారుల కోసమే ఇదంతా చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని రాష్ట్రాలను కూడగట్టుకుని పోరాటం చేస్తామన్నారు బిఆర్ఎస్ ఎంపీలు. ఇంత పెద్ద ఎత్తున స్కాం జరగడం, గుజరాత్ వ్యాపారస్తుల కోసమే చేసిన అతి పెద్ద స్కాం ఇది అంటూ మండిపడ్డారు. ఈ విషయాన్ని పార్లమెంటు ఉభయసభలలో బయటపెడతామన్నారు బిఆర్ఎస్ ఎంపీలు.