లిక్కర్ స్కామ్ లో కేజ్రీవాల్ అరెస్టుతో ఆప్లో అనిశ్చితి.. నెక్స్ట్ వారసులెవరు?

-

ఈడీ అరెస్టుతో దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రస్థానంలో కీలక పరిణఆమం చోటుచేసుకుంది. ఇండియా కూటమితో కలిసి దిల్లీ, హరియాణా, గుజరాత్ లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సాగుతున్న తరుణంలో ఈ అరెస్టు జరగడం గమనార్హం. ఎన్నికల ముంగిట పార్టీ కార్యకలాపాలు, వ్యూహ రచన, అమలులో కేంద్రంగా ఉన్న కేజ్రీ ఈ సమయంలో అరెస్టు కావడంతో ఈ ఎన్నికల్లో ఆప్పై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. కేజ్రీవాల్ అరెస్టు, ఆయన సహాయకులు సంజయ్ సింగ్, మనీశ్ సిసోదియా, సత్యేందర్ జైన్ జైలులో ఉండటం, కొంత మంది నేతలు అజ్ఞాతంలో ఉండటం వల్ల పార్టీలో అనిశ్చితి నెలకొంది.

ఈ నేపథ్యంలో అరవింద్‌ కేజ్రీవాల్‌ అరెస్టు తర్వాత ఆప్‌ నాయకత్వం ప్రశ్నార్థకంగా మారింది. పార్టీని నడిపించేది ఎవరు? ముఖ్యమంత్రి బాధ్యతల్ని ఎవరు చేపడతారు అనేది చర్చనీయాంశమైంది. విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారిణి అయిన కేజ్రీవాల్‌ భార్య సునీతా కేజ్రీవాల్‌, దిల్లీ కేబినెట్‌ మంత్రులు ఆతిశీ, సౌరభ్‌ భరద్వాజ్‌ పేర్లు కేజ్రీ రిప్లేస్మెంట్కు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news