తుపాకీతో ఇంట్లోకి చొరబడ్డ దొంగలు.. ఉరికించి మరీ కొట్టిన తల్లీకూతుళ్లు

-

సికింద్రాబాద్‌ బేగంపేట పరిధిలోని రసూల్పురాలో ఓ ఇంట్లోకి ఇద్దరు ఆగంతకులు ప్రవేశించారు. చోరీకి యత్నించిన వారిని తరిమేందుకు తల్లీకుమార్తెలు చేసిన విరోచిత పోరాటం స్ఫూర్తిగా నిలుస్తోంది. దుండగుడి చేతిలో తుపాకీ ఉన్నా ఏ మాత్రం భయపడకుండా వారిద్దరూ ఎదిరించిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏం జరిగిందంటే?

రసూల్‌పుర జైన్‌కాలనీలో గురువారం మధ్యాహ్నం ప్రేమ్‌చంద్‌, సుశీల్‌కుమార్‌ కొరియర్‌ సర్వీసు వచ్చిందంటూ ఇంటి ప్రాంగణంలోకి వచ్చి నాటు తుపాకీతో ఆ ఇంట్లోని తల్లీకుమార్తెలను బెదిరించాడు. ఆ తర్వాత ప్రేమ్‌చంద్‌ వంటగదిలోకి వెళ్లి పనిమనిషి మెడపై కత్తి పెట్టి విలువైన వస్తువులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఏ మాత్రం బెదరని ఆ తల్లీబిడ్డలు దుండగుడిని తీవ్రంగా ప్రతిఘటించారు. పట్టుకునే ప్రయత్నం చేస్తున్న క్రమంలో.. తృటిలో తప్పించుకున్న ఆగంతకుడు… పరుగులు తీస్తూగేటు నుంచి పారిపోయాడు. మరో వ్యక్తి ఇంట్లో ఉండడాన్ని గమనించి అతడిని కూడా తరిమికొట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news