ఇండియాలో కండోమ్ త‌క్కువ‌గా వాడుతున్న యువ‌త‌.. ‘కండోమాలజీ’ నివేదిక

భార‌త‌దేశం జ‌నాభాలో దాదాపుగా 50 శాతం మంది 24 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ కాగా, 65 శాతం మంది 35 ఏళ్ల వ‌య‌సు వారు. అయితే యంగ్ ఇండియా మాత్రం ఏమేర‌కు ఆరోగ్య సూత్రాల‌ను పాటిస్తుంద‌న్న‌ది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. భార‌త్‌లో కండోమాల‌జీ పేరిట‌ మొట్ట‌మొద‌టిసారిగా చేసిన స‌ర్వే నివేద‌కలో ఆందోళ‌నక‌ర విష‌యాలు తెలుస్తున్నాయి. భార‌త‌దేశంలో కండోమ్ వాడుతున్న యువ‌త సంఖ్య చాలా త‌క్కువ‌గా ఉంటోంద‌ని తెలిసింది. పెండ్లికి ముందు సెక్స్ చేసుకునే యువ‌త చాలా వ‌ర‌కు కండోమ్, గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌లు లేకుండా సెక్స్‌లో పాల్గొంటుందంట‌. భార‌తీయ జ‌నాభాలో సగం మంది 24 ఏళ్లలోపువారు ఉంటే, 65 శాతం మంది 35 ఏళ్లలోపువారు ఉన్నారు.

వీంర‌తా త‌ర‌చుగా సెక్స్‌లో పాల్గొనే వాళ్లే. కండోమ్ అల‌య‌న్స్ నిర్వ‌హించిన స‌ర్వేలో సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ‘కండోమాలజీ’ నివేదిక ప్రకారం 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల దాదాపు 80 శాతం మంది మ‌గ‌వారు పెండ్లికి ముందు సెక్స్ చేసే స‌మ‌యంలో అస్స‌లు కండోమ్ వాడ‌ట్లేదు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4 (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ 4) డేటా ప్ర‌కారం 20 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు గల దాదాపు 80 శాతం మంది యువ‌కులు గ‌ర్భ‌నిరోధ‌క చ‌ర్య‌లు తీసుకోకుండానే త‌మ భాగ‌స్వామితో శృంగారం జ‌రిపార‌ని తెలుస్తుంది. ఇలా ప్ర‌ణాళిక లేకుండా చేసే శృంగారం వ‌ల్ల గ‌ర్భ‌స్రావాలు పెర‌గ‌టం.. ఎంత మాత్ర‌మూ మంచిది కాద‌నేది గ‌మ‌నించాలి.

దీంతో విచ్చ‌ల‌విడిగా గ‌ర్భ‌స్రావ కేసులు పెరిగిపోతున్నాయి. ఇక అమ్మాయిలు కూడా చాలా వ‌ర‌కు గ‌ర్భ‌నిరోధ‌క మాత్ర‌ల‌ను వాడ‌ట్లేదు. వివాహానికి ముందు శృంగారంలో పాల్గొన్న 7 శాతం మ‌హిళ‌లు, 27 శాతం మంది పురుషులు ఎప్పుడు కూడా కండోమ్ వినియోగించ‌లేదు. సెక్స్ సమయంలో 3 శాతం మంది మ‌హిళ‌లు, 13 శాతం పురుషులు మాత్రమే కండోమ్‌, గ‌ర్భినిరోధ‌క మాత్ర‌లను వాడుతున్నారు. దీంతో ఇండియాలో హెచ్ ఐవీ కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయి. నిర్ల‌క్ష్యం కార‌ణం కావ‌చ్చు లేక అవ‌గాహ‌న లోపం కావ‌చ్చు కార‌ణ‌మేదైనా ప్రపంచవ్యాప్తంగా హెచ్ఐవి కేసులలో భారతదేశం మూడవ స్థానంలో ఉంది.

యువ‌త‌కు సెక్స్ సంబంధిత విష‌యాల గురించి అవ‌గాహ‌న లేక‌పోవ‌డ‌మే ఇందుకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. గ‌ర్భ‌నిరోధ‌క ప‌ద్ద‌తుల‌పై ప్ర‌భుత్వం అవ‌గాహ‌న క‌ల్పిస్తున్న‌ప్ప‌టికీ ఫ‌లితాలు మాత్రం క‌నిపించ‌టం లేద‌ని, యువ‌త‌కు ఇలాంటి విష‌యాల‌పై అవ‌గామ‌న పెంచాల‌ని అల‌య‌న్స్ స‌భ్యులు కోరుతున్నారు. లేదంటే యువ‌త అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు.