ఇవాళ రెండో రోజు శాసన సభ సమావేశాలు ప్రారంభం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యం లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వినూత్న నిరసన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ… గుర్రపు బగ్గీ పై అసెంబ్లీకి వచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. గుర్రపు బుగ్గీతో అసెంబ్లీ లోకి వెళతామని పట్టుబట్టారు కాంగ్రెస్ నేతలు. అయితే.. దానికి పోలీసులు నిరాకరించారు.
దీంతో కాంగ్రెస్ నేతలు మరియు పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది. దీంతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు భట్టి విక్రమార్క, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క, మరియు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మరియు కేంద్ర సర్కార్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. రైతులు చేపట్టిన భారత్ బంద్ కు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు తెలపడం లేదంటూ నిప్పులు చెరిగారు. సీఎం కేసీఆర్ మరియు పీఎం మోడీ ఇద్దరూ ఒక్కటేనని మండిపడ్డారు.