వైరల్ గా మారిన నయనతార – విగ్నేష్ పెళ్లి కార్డు ..!

-

ప్రముఖ తమిళ దర్శకుడు విగ్నేశ్ శివన్ ను సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార వివాహం చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే రహస్యంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ తిరుపతిలో మరికొద్ది రోజుల్లో వివాహం చేసుకోబోతున్నారని కోలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున వార్తలు ప్రచురితం అవుతున్నాయి. ఇకపోతే ఇప్పటికే వీరిద్దరి పెళ్ళికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ప్రారంభించారు అని, అందులో భాగంగానే తంజావూరు లో ఉన్న తమ కుల దైవం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు సమాచారం. ఇక జూన్ 9వ తేదీన వీరిద్దరి వివాహం తిరుమల తిరుపతి దేవస్థానం సన్నిధి లో జరగబోతోంది అంటూ పెద్దఎత్తున ప్రచారం నడిచింది.

కానీ అనూహ్యంగా కొన్ని అనుకోని కారణాలవల్ల వారి వివాహ వేదిక మారినట్లుగా సమాచారం. హిందూ సాంప్రదాయం ప్రకారం వీరి పెళ్లి జరగనుంది అని టాక్ నడుస్తోంది. కుటుంబసభ్యులు , బంధుమిత్రులు వంటి కొద్దిమంది సన్నిహితుల మధ్య వివాహం జరగబోతోంది. ఇప్పటికే బంధువులకు, అతిథులకు డిజిటల్ ఇన్విటేషన్ వీడియో కూడా పంపించారు. ప్రస్తుతం వారి పెళ్లికి సంబంధించిన ఒక డిజిటల్ ఇన్విటేషన్ కార్డు వీడియో ఇదే అంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కెర్లు కొడుతోంది. ఇక అందులో ఉన్న సమాచారం ప్రకారం జూన్ 9వ తేదీన మహాబలిపురంలో ఉన్న మహబ్ హోటల్లో వీరి పెళ్లి జరగబోతుంది.

ఇండస్ట్రీలో సన్నిహితుల కోసం చెన్నైలో వెడ్డింగ్ రిసెప్షన్ కూడా జరిగే అవకాశం ఉందట. విగ్నేష్ , నయన్ దాదాపుగా ఏడు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. వీరికి రహస్యంగా ఎంగేజ్మెంట్ అయిందనే విషయం బాగా చక్కర్లు కొట్టగా ఇదే విషయాన్ని విగ్నేష్ కూడా ఒక సినిమా ప్రమోషన్లో బయటపెట్టాడు. ప్రస్తుతం విగ్నేష్ నయనతార పెళ్లి కోసం అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news