తమిళనాడు సీఎం స్టాలిన్ ను కలిసిన నయనతార

-

లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొదట్లో హీరోయిన్ గానే కొనసాగిన ఈ లేడీ సూపర్ స్టార్…. ఆ తర్వాత… లేడీ హీరోగా కూడా సినిమాలు కూడా చేసింది. అయితే.. దర్శకుడు విగ్నేష్‌ శివన్‌-నయన తార ప్రస్తుతం లవ్‌ లో ఉన్న సంగతి తెలిసిందే. 5 సంవత్సరాలుగా… వీరు ప్రేమించుకుంటుండగా.. ఇదిగో పెళ్లి, అదిగో పెళ్లి అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.


ఈ నేపథ్యంలోనే… వీరి వివాహంపై ఓ క్లారిటీ వచ్చింది. జూన్ 9వ తేదీన వీరిద్దరూ మూడుముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. తిరుమలలో శ్రీవారి సన్నిధిలో వీరి వివాహం జరగనున్నట్లు సమాచారం అందుతోంది. అయితే ఈ నేపథ్యంలోనే తమ పెళ్లి పత్రికను ప్రముఖులకు అందజేస్తోంది ఈ కొత్త జంట. ఇందులో భాగంగానే తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ ను కలిసింది నయనతార జంట. తమ వివాహ కార్యక్రమానికి ముఖ్యమంత్రి స్టాలిన్ కచ్చితంగా హాజరు కావాలని ఈ సందర్భంగా వారు కోరారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news