ఆ స్టార్ హీరో తో మళ్లీ నయనతార రొమాన్స్!

-

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళం భాషల్లో పలు బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి.. అందం, అభినయంతో యువతను ఆకట్టుకున్న ఈమె కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న బాలీవుడ్ బిగ్గెస్ట్ మూవీ జవాన్ లో హీరోయిన్గా నటిస్తోంది.

ఇందులో విలన్ గా విజయ్ సేతుపతి నటిస్తున్నారు. ఈ సినిమా జూన్ మూడవ తేదీన ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతోంది. అయితే..ఈ హీరోయిన్ నయనతార మరోసారి హీరో జైతో జోడి కట్టనుంది. జై పుట్టినరోజు సందర్భంగా నయనతార 75వ సినిమాలో జై హీరోగా నటిస్తున్నట్లు జి స్టూడియోస్ ప్రకటించింది. పదేళ్ల క్రితం నయనతార, జై కలిసి రాజారాణి మూవీలో నటించారు. ఈ మూవీ సూపర్ హిట్ అయింది. త్వరలో కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. తాజా మూవీ ప్రకటనతో నయనతార పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పనుందన్న ప్రచారానికి బ్రేక్ పడింది.

 

Read more RELATED
Recommended to you

Latest news