NBK107 బిగ్ అప్డేట్..సింహం వేటకు సిద్దం !

-

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ‘‘అఖండ’’ సినిమాతో ఘన విజయం అందుకున్నారు. బోయపాటి శ్రీను-బాలయ్య కాంబోలో వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ ఫిల్మ్ తర్వాత బాలయ్య లైనప్ మూవీస్ పైన భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ క్రమంలోనే ‘క్రాక్’ ఫేమ్ గోపీచంద్ మలినేనితో సినిమాకు ఒప్పుకున్నారు బాలయ్య.

NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో భారీ తారగణమే ఉంది. హీరోయిన్ గా బ్యూటిఫుల్ శ్రుతిహాసన్ నటిస్తుండగా, కీలక పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్ పోషిస్తోంది. ఇక కన్నడ స్టార్ హీరో దునియా విజయ్ ఇందులో నెగెటివ్ రోల్ ప్లే చేస్తున్నారు.

హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఈ మూవీ నుంచి తాజాగా బిగ్ అప్డేట్.. వచ్చింది. ఈ సినిమ నుంచి ఫస్ట్ రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఓ మాస్ లుక్ విడుదల చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news