NBK107 నుంచి బాలయ్య ఫస్ట్ లుక్ రిలీజ్.. ఇక నందమూరి ఫ్యాన్స్ కు పండగే

-

నందమూరి బాలయ్య కు ఎంత క్రేజ్‌ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అఖండ సినిమాతో బంపర్‌ హిట్‌ కొట్టాడు నందమూరి బాలయ్య. అయితే.. ఈ సినిమా తర్వాత క్రాక్ మూవీతో ఫుల్ ఫామ్ లో ఉన్న… గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ తన 107 వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోంది.

అయితే ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ కాన ప్పటికీ.. హీరోయిన్ ను కూడా అనౌన్స్ చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో శృతిహాసన్ బాలయ్య సరసన నటిస్తోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి నందమూరి బాలయ్య ఫస్ట్ లుక్ ను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ లుక్ విషయానికి వస్తే… నందమూరి బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించాడు.

బ్లాక్ కారు… పక్క నుంచి నడుచుకుంటూ వస్తూ అందరినీ అలరిస్తున్నాడు. బ్లాక్ షర్ట్ వేసుకున్న బాలయ్య… లుంగీతో దర్శనమిచ్చాడు. ఇక మైనింగ్ మాఫియా బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఈ సినిమా నడిచేలా ఈ పోస్టర్ కనిపిస్తోంది. ఇక ఈ పోస్టర్ విడుదల కావడంతో నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కాగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news