NDTV టెలివిజన్ లో ముసలం నెలకొంది. టెలివిజన్ నుంచి ప్రణయ్ రాయ్, రాధికా రాయ్ తప్పుకున్నారు. NDTV టెలివిజన్ లిమిటెడ్ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ మరియు ఆయన భార్య రాధికా రాయ్ తక్షణమే ప్రమోటర్ గ్రూప్ వెహికల్ RRPRH డైరెక్టర్ల పదవికి రాజీనామా చేశారు.
ఈ విషయాన్ని ఆ కంపెనీ మంగళవారం ఆలస్యంగా రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. NDTV టెలివిజన్ లో వ్యాపారవేత్త గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ వాటా ఉన్న నేపథ్యంలోనే… NDTV టెలివిజన్ లిమిటెడ్ వ్యవస్థాపకులు ప్రణయ్ రాయ్ మరియు ఆయన భార్య రాధికా రాయ్ రాజీనామా చేశారని సమాచారం అందుతోంది. అయితే.. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.
Unfollowing @ndtv
Thanks for the good work thus far 👍 https://t.co/7IsU6TljjJ
— KTR (@KTRTRS) November 30, 2022