Neeraj Chopra : నీరజ్ చోప్రా కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ లో ఛాంపియన్ గా నిలిచిన భారత తొలి క్రీడాకారుడిగా చరిత్రకి ఎక్కాడు. స్విట్జర్ల్యాండ్ లోని జ్యూరీలో గురువారం రాత్రి జరిగిన ఫైనల్ లో చోప్రా స్వర్ణం కైవసం చేసుకున్నాడు. ప్రపంచంలోని ఆరుగురు మేటి జావెలిన్ త్రోయర్లు పోటీ పడ్డ తుది పోరులో నీరజ్ తన బల్లెంను అత్యధికంగా 88.44 మీటర్లు విసిరి విజేతగా నిలిచాడు. తన తొలి ప్రయత్నం లోనే చోప్రా అందరికంటే ఎక్కువ దూరం విసిరి స్వర్ణం సాధించడం విశేషం.
గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ కు దూరంగా ఉన్న నీరజ్, నెలన్నర విరామం తర్వాత జూలై చివర్లో లాసనే డైమండ్ లీగ్ లో విజేతగా నిలిచి ఫైనల్స్ కు అర్హత సాధించాడు. డైమండ్ లీగ్ ఫైనల్ లో అతను పోటీ పడటం ఇది మూడోసారి. గతంలో 2017, 2018 ఎడిషన్స్ లో ఫైనల్స్ ఆడిన, వరుసగా ఏడు, నాలుగో స్థానంలో స్థానాలలో సరిపెట్టాడు. ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగి వచ్చాడు.