ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రా మరో ఘనత సాధించాడు. అత్యంత ప్రతిష్టాత్మక లారియూస్ బ్రేక్ త్రూ అవార్డుకు ఈ గోల్డ్ మెడల్ విన్నర్ నామినేడ్ అయ్యాడు. ఇతనితో పాటు మొత్తం ఆరుగురు ఆటగాళ్లు ఈ అవార్డుకు నామినేట్ అయ్యారు. కాగ లారియూస్ బ్రేక్ త్రూ అవార్డు నామినేట్ అయిన వారిలో ఈ ఒలింపిక్ గోల్డ్ మెడల్ విన్నర్ నీరజ్ చోప్రాతో పాటు టెన్నిస్ రంగానికి చెందిన ఎమ్మా రాడుకాను, డెనిల్ మెద్వెదేవ్ ఉన్నారు.
అలాగే ఫుట్ బాల్ రంగానికి చెందిన పెడ్రి, అథ్లెట్ రంగానికి చెందిన యులీమార్ రోజాస్ తో పాటు స్విమ్మింగ్ రంగానికి చెందిన ఆరియార్నే ఉన్నారు. ఇదీల ఉండగా.. జావెలిన్ త్రో ఆటగాడు నీరజ్ చోప్రా గత ఏడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో బంగారు పతకం సాధించిన తర్వాత నీరజ్ చోప్రా క్రేజ్ దేశం మొత్తం పెరిగిపోయింది. జావెలిన్ త్రో నే కాకుండా అథ్లేటిక్స్ రంగంలో భారత్ తొలి స్వర్ణాన్ని తీసుకువచ్చిన నీరజ్ చోప్రా అనేక అవార్డులను సొంతం చేసుకుంటున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మక లారియూస్ బ్రేక్ త్రూ అవార్డును కూడా గెలుచుకునే అవకాశాలు కూడా ఉన్నాయి.