హుజూరాబాద్ ఓటమి తర్వాత నుంచి కేసీఆర్ లో అభద్రతాభావం కనిపిస్తోంది- కిషన్ రెడ్డి, కేంద్రమంత్రి.

-

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్… ప్రధాని మోదీపై, బీజేపీపై చేసిన విమర్శలు పొలిటికల్ మంటలు రేపుతున్నాయి. ప్రధానమంత్రిని తీవ్రస్థాయిలో విమర్శించడంతో పాటు ప్రధాని కేవలం గుజరాత్ కే ప్రధాని అంటూ.. ఎన్నికల వేళ ఆయా రాష్ట్రాల వేషధారణ వేస్తారంటూ… విమర్శలు చేశారు కేసీఆర్. బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి బంగాళాఖాతంలో కలపాలని తీవ్రంగా విమర్శించారు. అయితే కేసీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య విమర్శలు, ప్రతివిమర్శల దాడి కొనసాగుతోంది.

తాజాగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా కేసీఆర్ వ్యాఖ్యలపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేసీఆర్ లో అభద్రతాభావం కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. ప్రధాని గురించి మాట్లాడేటప్పుడు భాష హుందాగా ఉండాలని కేసీఆర్ కు సూచించారు. హుజూరాబాద్ ఫలితాల అనంతరం నుంచి సీఎం కేసీఆర్ బీజేపీ పై విషప్రచారం చేస్తున్నారని అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉండి.. రాజ్యాంగం మార్చాలని చెబుతున్నారని అన్నారు. అంబేద్కర్ ను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని విమర్శించారు. నలుగురిని ఆకట్టుకునేలా మాట్లాడితే.. అబద్దాలు నిజాలు అయిపోవని కిషన్ రెడ్డి విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news