ఏపీలో జాబ్ మేళా… వివరాలు మీకోసం…!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ ఉద్యోగావకాశాలని కల్పిస్తోంది. తాజాగా ఈ నెల 30న మరో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. విశాఖపట్నం జిల్లా అరకులోని యూత్ ట్రైనింగ్ సెంటర్ లో ఉదయం 10 గంటలకు ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.

 

jobs
jobs

ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ ఇంటర్వ్యూ లో పాల్గొనవచ్చు. ఇక ఆయా కంపెనీల వివరాలలోకి వెళితే… వరుణ్ మోటార్స్ సంస్థలో మొత్తం 30 ఖాళీలున్నాయి. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు అప్లై చెయ్యచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 10 వేల వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. అలానే మెడ్ ప్లస్ ఫార్మసీ సంస్థలో 50 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, B/M/D ఫార్మసీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు.

అదే విధంగా గ్లాడియేటర్ సెక్యూరిటీ సర్వీసెస్ సంస్థలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్ ఆపై విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోచ్చు.10 వేల వేతనంతో పాటు పీఎఫ్+ఈఎస్ఐతో పాటు ఉచిత భోజన సదుపాయం ఉంటుంది. టాటా స్కై లో 100 ఖాళీలు ఉన్నాయి. టెన్త్, డిగ్రీ, ఎంబీఏ విద్యార్హత కలిగిన వారు అర్హులు. ఐనాక్స్ లో మొత్తం 30 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.

ఇంటర్, ఆపై విద్యార్హతలు కలిగిన వారు అర్హులు. ఆసక్తి ఉంటే ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆధార్ కార్డు, పాన్ కార్డు, వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, డ్రైవింగ్ లైసెన్స్, విద్యార్హత సర్టిఫికేట్లను వంటివి ఇంటర్వ్యూ కి తీసికెళ్ళాలి. పూర్తి వివరాల కోసం 9014767230, 9949927899 సంప్రదించండి.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.