వీడు మాముూలోడు కాదండోయ్.. 550 మందికి తండ్రైన డాక్టర్.. ఆపేందుకు సర్కార్ యత్నం

-

నెదర్లాండ్స్​కు చెందిన జొనాథన్(41) అనే వైద్యుడు ఇప్పటివరకు నెదర్లాండ్స్​తో పాటు ప్రపంచ వ్యాప్తంగా 13 క్లినిక్​లలో వీర్యదానం చేసి 550 మందికి తండ్రి అయ్యాడు. అతడి వీర్యం సాయంతో బిడ్డను కన్న ఓ మహిళ ఇకపై అతడు మరెవరికీ వీర్యదానం చేయకూడదని డోనర్​కైండ్ ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి కేసు వేశారు. నిబంధనల ప్రకారం ఒక వ్యక్తి 25 మంది చిన్నారులకు మాత్రమే జన్మనివ్వాలి. భవిష్యత్​లో రక్త సంబంధీకుల మధ్య లైంగిక సంబంధాలు తలెత్తకుండా చూడటం, పుట్టిన సంతానం మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిబంధనలు రూపొందించారు.

జొనాథన్ వంద మందికి పైగా చిన్నారులకు వీర్యదానం ద్వారా జన్మనిచ్చాడని 2017లోనే తెలిసింది. దీంతో నెదర్లాండ్స్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమైంది. ది డచ్ సొసైటీ ఆఫ్ అబ్ట్సెట్రిక్స్ అండ్ గైనకాలజీ (ఎన్​వీఓజీ) అతడిని బ్లాక్​లిస్ట్​లో చేర్చింది. జొనాథన్ దానం చేసిన వీర్యాన్ని వినియోగించకూడదని అన్ని వీర్య బ్యాంకులకు విజ్ఞప్తి చేసింది. అయితే, వేటు పడ్డప్పటికీ జొనథన్ వెనక్కి తగ్గలేదని డోనర్​కైండ్ సంస్థ ఆరోపిస్తోంది. విదేశీయులకు తన వీర్యాన్ని దానం చేయడం ప్రారంభించాడని తెలిపింది. వీర్యం అవసరమైన మహిళలతో సోషల్ మీడియాలో పరిచయం పెంచుకున్నాడని… అక్రమ మార్గాల్లో వీర్యదానం చేశాడని వివరించింది.

జొనథన్ ప్రస్తుతం కెన్యాలో ఉన్నట్టు నెదర్లాండ్స్ మీడియా వెల్లడించింది. న్యాయ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు బయటకు రావాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news