పోస్టాఫీసు కస్టమర్స్ కు అలర్ట్‌.. ఏప్రిల్ 1 నుంచి ఈ పథకాలల్లో మార్పులు..

-

మార్చి నెల మరో రెండు రోజుల్లో ముగుస్తుంది..ఏప్రిల్ నెల వస్తుంది.. దాంతో కొత్త నిభందనలు కూడా రాబోతున్నాయి.వచ్చే నెల ఫైనాన్షియల్‌ సెక్టర్‌తో పాటు వివిధ ప్రభుత్వ పథకాలలో మార్పులు చోటు చేసుకోనున్నాయి..ఈ క్రమంలోనే ప్రభుత్వ పథకాలలో కొన్ని మార్పులను చేసింది.. రెండు పోస్టాఫీసు పథకాలలో కొన్ని మార్పులు చేసింది కేంద్రం. మహిళా పెట్టుబడిదారుల కోసం కొత్త పథకాన్ని కూడా ప్రవేశపెట్టింది. మీరు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌లో ఇన్వెస్ట్ చేసినట్లయితే, లేదా అందులో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లయితే కొన్ని మార్పులను గమనించాలి… అవేంటో ఒకసారి చూద్దాం..

 

 

 

 

 

 

 

 

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ పెట్టుబడి పరిమితిని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు..ఈ జనవరి-మార్చి త్రైమాసికానికి సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై అందించే వడ్డీ రేటు 8%. కనిష్ట డిపాజిట్ రూ. 1000, అలాగే మల్టిపుల్ 1000తో 5 సంవత్సరాలకు నిర్ణయించబడుతుంది. సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ వడ్డీ పన్ను మినహాయింపు లేదని గుర్తుంచుకోవాలి.ఇక పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ కోసం సింగిల్ ఖాతాదారుల పరిమితిని రూ.4 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచారు. జాయింట్ హోల్డింగ్ కోసం పరిమితి రూ.9 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచారు. అలాగే నెలవారీ ఆదాయ పథఖం పెట్టుబడిదారులు ప్రతి నెల వడ్డీ చెల్లింపులను పొందవచ్చు..

మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఇటీవల వార్షిక బడ్జెట్‌లో కొత్త పథకాన్ని ప్రకటించింది. మహిళా ఇన్వెస్టర్లే లక్ష్యంగా.. మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్‌ను తీసుకొచ్చింది. రెండేళ్ల కాలవ్యవధితో వన్ టైం స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఇది. అయితే ప్రభుత్వం దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మాత్రం వెల్లడించలేదు.. కానీ 2025 లో ఇది ముగుస్తుందని సమాచారం.ఇందులో గరిష్టంగా 7.5 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇక గరిష్టంగా ఒక్కో పేరు మీద ఇందులో రూ.2 లక్షల వరకు ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది..

Read more RELATED
Recommended to you

Latest news