అలాంటి ఫోటో కావాలని అడిగిన నెటిజన్.. ఫోటో షేర్ చేసి షాక్ ఇచ్చిన పాయల్..!!

-

ఆర్ఎక్స్ 100 సినిమాలో తెలుగు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తర్వాత తెలుగులో వరుస ఆఫర్లను దక్కించుకొని స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకునే పనిలో క్రేజీ ప్రాజెక్టులకు వరుస గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూ.. రెట్టించిన ఉత్సాహంతో సోషల్ మీడియాలో బిజీగా ఉంటుంది. ఇక అదే సమయంలో సోషల్ మీడియాలో కూడా తెగ హడావిడి చేస్తూ నేటిజనులతో చిట్ చాట్ కూడా చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫుల్ బోల్డ్ కంటెంట్ లో నటించడానికి ఏమాత్రం వెనుకాడదు. ఒకరవైపు గ్లామర్ షో వొలకబోస్తూనే.. మరొకవైపు లిప్ లాక్ లతో కుర్రకారును రెచ్చగొడుతూ ఉంటుంది. ఇక ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆర్డీఎక్స్ లవ్, వెంకీ మామ, డిస్కో రాజా వంటి సినిమాలలో నటించింది. అంతేకాదు అనగనగా ఓ అతిథి, అనే ఓటీటి చిత్రంతోపాటు త్రీ రోజెస్ అనే సిరీస్ లో కూడా కనిపించింది. వీటితోపాటు పలు స్పెషల్ సాంగ్ లలో కూడా మెప్పించింది..Payal Rajput raises temperature in new photoshoot | See pictures

ఇటీవల ఆది సాయికుమార్ తో తీస్ మార్ ఖాన్ సినిమాలో నటించగా.. పెద్దగా ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో విజయం లభించలేదు. ఇప్పుడు మంచు విష్ణు తో కలిసి జిన్నా అనే సినిమాలో నటిస్తోంది. వీటితోపాటు తమిళ్, కన్నడ, పంజాబీ భాషల్లో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇక సినిమాలలో బిజీగా ఉంటూనే మరొకపక్క తన ప్రియుడు సౌరబ్ డింగ్రా తో అంతే స్థాయిలో ఎంజాయ్ చేస్తోందని చెప్పవచ్చు. ఇక వీళ్లిద్దరూ చాలా కాలం కలిసే ఉంటున్నారు. ఇప్పుడు త్రీ రోజెస్ సినిమాలో కూడా హీరోగా అతడు నటించడం జరిగింది.Image

ఇకపోతే ఎప్పుడు సోషల్ మీడియాలో బిజీగా ఉండే పాయల్ అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో ముచ్చటిస్తూ ఉంటుంది. ఇక ఈ క్రమంలోనే తాజాగా తన అభిమానులతో ముచ్చటించింది. అందులో భాగంగానే ఒక నెటిజన్ పాయల్ రాజ్ పుత్ ను మేకప్ లేకుండా ఉన్న నీ ముఖాన్ని చూడాలని ఉంది అని రిక్వెస్ట్ చేశాడు. ఇక వెంటనే తనదైన శైలిలో స్పందించింది . అతడి కోరికను తీర్చేందుకు ఒక ఫిల్టర్ ను కూడా వాడుతూ దిగిన భయానకమైన పిక్ ను షేర్ చేసింది. ఇక ఇది చూసిన సదరు నెటిజన్ తో పాటు అది చూసిన వాళ్లంతా కూడా షాక్ అవుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Latest news